కరోనా నేపథ్యంలో ప్రస్తుతం శానిటైజర్ల వినియోగం పెరిగింది. ఈ పరిస్థితిని అదునుగా చేసుకుని శానిటైజర్ల ధరలు పెరగకుండా కేంద్రం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. 200 మిల్లీలీటర్ల శానిటైజర్ రిటైల్ ధర రూ.100 మించకూడదని విక్రయదారులకు సూచించింది.
వీటితో పాటు 2 లేయర్ల (సర్జికల్) మాస్క్‌ల ధరలు రూ.8, మూడు లేయర్ల (సర్జికల్) మాస్క్ ధర రూ.10 మించొద్దని వినియోగదారు వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాసవాన్ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.
శానిటైజర్లు, మాస్క్‌లను నిత్యావసర వస్తువుల జాబితాలో చేరుస్తూ ఈ నెలారంభంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆల్కాహాల్ ఆధారిత శానిటైజర్ల ధరలపై ఆంక్షలు విధించింది.
ఇదీ చూడండి:కరోనాపై పోరుకు 'సబ్బుల' సహాయం