ETV Bharat / business

భారత్‌లో టిక్‌టాక్‌ సహా 59 యాప్​లపై నిషేధం - Tiktok today news

Government of India bans 59 mobile apps
భారత్‌లో టిక్‌టాక్‌ సహా 59 యాప్​లపై వేటు
author img

By

Published : Jun 29, 2020, 8:52 PM IST

Updated : Jun 29, 2020, 10:03 PM IST

21:49 June 29

Government of India bans 59 mobile apps
59 యాప్​ల లిస్ట్​

చైనాతో సరిహద్దు ఉద్రిక్తల మధ్య భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిక్​టాక్​, షేర్​ ఇట్​ సహా 59 చైనా యాప్స్​ను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ యాప్‌లను దేశ ప్రజలు వాడొద్దని సూచించింది. వీటి ద్వారా భారత్‌ నుంచి రకరకాల సమాచారం సేకరిస్తున్నాయంటూ చైనాకు భారత్‌ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఆ దేశం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

"ఈ యాప్స్​ ద్వారా భారత సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగే అవకాశముందని విశ్వసనీయ సమాచారం అందింది. అందువల్ల కోట్లాది మంది భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వీటిని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది."

 -- ఐటీ అండ్​ ఎలక్ట్రానిక్స్​ శాఖ ప్రకటన.

సర్వత్రా ఆందోళనలు..

గత నెల నుంచి సరిహద్దులో భారత సైనికులపైకి చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో గల్వాన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘటనలో 20మంది భారత జవాన్లను చైనా పొట్టనపెట్టుకుంది. అప్పటి నుంచి చైనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు గళం విప్పారు. ఈ క్రమంలో చైనా యాప్స్​పై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

20:50 June 29

భారత్‌లో టిక్‌టాక్‌ సహా 59 యాప్​లపై నిషేధం

సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల  భారత్‌-చైనా దేశాల సరిహద్దులో గల్వాన్‌ వద్ద భీకర ఘర్షణలో మన దేశానికి చెందిన 20మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.  చైనాకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని భావిస్తోన్న భారత్‌.. ఈ నిర్ణయం తీసుకుంది. 

Last Updated : Jun 29, 2020, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.