దేశంలో రోజురోజుకీ ఇంధన ధరలు పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు దీపావళి పర్వదినం వేళ కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు గురువారం నుంచి అమలులోకి రానుంది.
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు పెట్రోల్ కంటే రెట్టింపుగా ఉండటం వల్ల రాబోయే రబీ సీజన్‌లో రైతులకు కొంత ప్రయోజనకరంగా ఉండనుందని పేర్కొంది. రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తే వినియోగదారులకు మరింతగా ఊరటగా ఉంటుందని కేంద్రం కోరినట్టు సమాచారం.
ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా త్వరలో 10వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్!