ETV Bharat / business

చేతులు కడుక్కోమని ఆ వాచ్​లు గుర్తు చేస్తాయ్​! - గూగుల్

కరోనా నివారణకు శుభ్రత చాలా అవసరం. ఇందుకు తరచూ చేతులు కడుక్కోవాలి. అయితే.. ఎన్నిసార్లు, ఎప్పుడు ఆ పని చేయాలి? దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించనవసరం లేదు. చేతులు ఎప్పుడు కడుక్కోవాలో గూగుల్​ స్మార్ట్​ వాచ్​లే ఇక మీకు గుర్తుచేస్తాయి.

Google Wear OS update adds periodic hand-washing reminder
ఆ స్మార్ట్​ వాచ్​లు చేతులు కడుక్కోమని గుర్తు చేస్తాయ్​!
author img

By

Published : Apr 19, 2020, 3:01 PM IST

గూగుల్​ ఓఎస్​ వీ5.4.0 స్మార్ట్​వాచ్​లలో సరికొత్త ఫీచర్​ వచ్చింది. అదే హ్యాండ్​ వాష్ రిమైండర్. ఈ కొత్త అప్​డేట్​తో... స్మార్ట్ వాచ్​లు ప్రతి మూడు గంటలకు ఒకసారి చేతులు కడుక్కోవాలని గుర్తు చేస్తాయి.

ప్రస్తుతం కరోనా నివారణకు తరచూ చేతులు కడుక్కోవడం అత్యవసరమైన పరిస్థితుల్లో ఈ అప్​డేట్​ను తీసుకొచ్చింది గూగుల్. ఈ రిమైండర్​ ఆన్​ చేసుకుంటే సబ్బుతో కనీసం 40 సెకన్లపాటు చేతులు శుభ్రం చేసుకోవాలన్న సందేశం తెరపై కనిపిస్తుంది.

ఎవరైనా చేతులు కడుక్కోలేని పరిస్థితిలో ఉన్నా, లేక ఇప్పటికే శుభ్రం చేసుకున్నా... వాచ్ స్క్రీన్​పై కనిపించిన "X" బటన్​ను క్లిక్​ చేస్తే రిమైండర్​ ఆగిపోతుందని వివరించింది గూగుల్.

ఇదీ చదవండి: 'ప్రభుత్వ ప్రకటన తర్వాతే బుకింగ్స్​ ప్రారంభించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.