ETV Bharat / business

గూగుల్​ 'హైబ్రిడ్​ వర్క్​ వీక్'​- 3 రోజులే ఆఫీస్​కు! - వర్క్​ ఫ్రం హోం

తమ ఉద్యోగుల కోసం గూగుల్​ కొత్త విధానం అమలు చేస్తోంది. హైబ్రిడ్​ వర్క్​ వీక్​ అనే కొత్త పద్ధతితో ఉద్యోగులు.. ఇక ఆఫీస్​కు వారంలో 3 రోజులే రావొచ్చని గూగుల్​, అల్ఫాబెట్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ స్పష్టం చేశారు. మిగతా రెండు రోజులు ఎక్కడి నుంచైనా చేసే స్వేచ్ఛ కల్పించారు.

Google to move to hybrid work week: Sundar Pichai
గూగుల్​ 'హైబ్రిడ్​ వర్క్​ వీక్'​
author img

By

Published : May 6, 2021, 4:26 PM IST

కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నో కార్పొరేట్​ సంస్థలు.. తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం కల్పించాయి. ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌.. ఓ అడుగు ముందుకేసి కొత్తగా హైబ్రిడ్​ వర్క్​ వీక్​ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తమ ఉద్యోగులు.. 3 రోజులు ఆఫీస్​కు రావాల్సి ఉంటుంది. మిగతా రెండు రోజులు ఉద్యోగుల నిర్ణయానికే వదిలేసినట్లు గూగుల్​, అల్ఫాబెట్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ స్పష్టం చేశారు.

ఆ రెండు రోజులు.. ఉద్యోగులకు ఇష్టమొచ్చిన, సౌకర్యంగా ఉన్న చోటు నుంచి చేయొచ్చని ఓ ప్రకటనలో తెలిపారు.

ఆఫీసులు తెరుచుకున్నా అవకాశం..

కరోనా తగ్గుముఖం పట్టి ఈ ఏడాది చివరికల్లా తమ కార్యాలయాలు తెరిచినా.. 20 శాతం మంది వర్క్​ ఫ్రమ్​ హోం చేస్తారని, 60 శాతం మందికి 'హైబ్రిడ్​ వర్క్​ వీక్'​ అవకాశం ఉంటుందని వెల్లడించారు.

2021 మొదటి త్రైమాసిక గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా గూగుల్​లో 1,39,995 మంది పూర్తిస్థాయి(ఫుల్​టైం) ఉద్యోగులు ఉన్నారు. ఏ దేశంలో ఎంతమంది తమ ఉద్యోగులు ఉన్నారో గూగుల్​ చెప్పకపోయినా.. భారత్​లో సుమారు 4 వేల మంది ఉంటారని అంచనా.

సర్చ్‌, క్లౌడ్‌, పేమెంట్స్‌, కృత్రిమ మేధ పరిశోధన విభాగాల్లోనే భారత్​కు చెందిన నిపుణులు ఉన్నారు. బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, గురుగ్రామ్‌లో ఎక్కువమంది పనిచేస్తున్నారు.

ఇదీ చూడండి: ఎల్​ఐసీ పని దినాలు ఇక వారంలో ఐదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.