ETV Bharat / business

'గూగుల్ మీట్' ఇప్పుడు అందరికీ ఉచితం

వీడియో కాన్ఫరెన్సింగ్​ యాప్..​ గూగుల్​ మీట్​కు ఆదరణ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్​ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్​ మీట్​ను ఉచితంగా అందిస్తున్నట్టు ప్రకటించింది.

author img

By

Published : May 13, 2020, 4:06 PM IST

Google Meet now free for all, coming in Gmail soon
'గూగుల్ మీట్' ఇప్పుడు అందరికీ ఉచితం

గూగుల్ తన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్​ 'మీట్'ను ఉచితంగా అందిస్తోంది. ఈ-మెయిల్ అడ్రస్ ఉన్న ఎవరైనా సైన్​ అప్ చేసి.. మీట్.గూగుల్.కామ్​ ద్వారా యాప్​ సేవలను పొందవచ్చు.

జీ సూట్​ వైస్ ప్రెసిడెంట్, జీఎమ్ జేవియర్ సోల్టెరో ప్రకారం.. ప్రజలు త్వరలో తమ జీ-మెయిల్​ ఖాతాల ద్వారా మీట్​ యాప్​ సేవలను పొందగలుగుతారు.

30 రెట్లు పెరిగిన వినియోగం...

జీ సూట్, జీ సూట్​ ఎడ్యుకేషన్​ వినియోగదారుల కోసం మీట్​ యాప్​ను సరికొత్త ఫీచర్​లతో ఆధునీకరించారు. ఇది ఈ మార్చి నెలలో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ మీట్ యాప్ రోజువారీ​ వినియోగం 30శాతం పెరిగిందని గూగుల్ ట్వీట్ చేసింది.

మీట్ యాప్​... ప్రతిరోజూ 3 బిలియన్ నిమిషాల వీడియో సమావేశాలు నిర్వహిస్తోంది. గత నెలలో ప్రతి రోజూ సుమారు 3 మిలియన్ల మంది మీట్​ యాప్​ ఖాతాదారులుగా మారిపోయారు. అందుకే ఈ యాప్​ను ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి చేరువ చేసేందుకు గూగుల్ సమాయత్తమవుతోంది.

ఇలా పనిచేస్తుంది...

గూగుల్ మీట్​ యాప్ ఓపెన్ చేసి 'స్టార్ట్ ఏ మీటింగ్​'ని క్లిక్ చేయాలి. అప్పుడు ప్రత్యేకమైన, సురక్షితమైన మీటింగ్​ విండో ఓపెన్ అవుతుంది. తరువాత మీరు ఇతరులకు 'మీటింగ్ కోడ్​' పంపి... సమావేశంలో చేరమని ఆహ్వానించవచ్చు. దీని తరువాత మీరు వీడియో సమావేశాలను ప్లాన్ చేయవచ్చు. గూగుల్ క్యాలెండర్​ నుంచి నేరుగా ఇతరులను ఆహ్వానించవచ్చు.

మీట్​లో సరళమైన షెడ్యూలింగ్, స్క్రీన్ షేరింగ్, రియల్ టైమ్ క్యాప్షన్స్, లేఅవుట్, టైల్డ్-వ్యూ ఆప్షన్స్​ ఉన్నాయి. ఇది చాలా సురక్షితమైనది. ఇది ఐఓఎస్​, ఆండ్రాయిడ్​ వినియోగదారులకు పూర్తి ఉచితంగా లభిస్తోంది.

ఇదీ చూడండి: ట్విట్టర్​ ఉద్యోగులు ఇక శాశ్వతంగా ఇంటి నుంచే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.