ETV Bharat / business

Twitter: 'ఐటీ నియమాలను ట్విట్టర్​ పాటించదా?' - వాట్సాప్​ వివరాలు

నూతన నిబంధనలను అనుసరించి ట్విట్టర్ మినహా ఇతర సామాజిక మాధ్యమాలు తమ సంస్థకు సంబంధించి వివరాలను ఐటీ శాఖతో పంచుకున్నాయి. దీనితో ట్విట్టర్​పై కేంద్రం గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

Twitter
'ఐటీ నియమాలను ట్విట్టర్​ పాటించదా?'
author img

By

Published : May 28, 2021, 11:29 PM IST

Updated : May 29, 2021, 7:33 AM IST

గూగుల్, ఫేస్​బుక్, వాట్సాప్​ సంస్థలు తమ వివరాలను ఐటీ మంత్రిత్వ శాఖతో పంచుకున్నాయని కేంద్రం పేర్కొంది. అవి నూతన ఐటీ నియామాలను పాటిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే ట్విట్టర్​ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది.

తమ సంస్థకు సంబంధించి ఛీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్​ వివరాలను ట్విట్టర్​​ ఇంకా కేంద్రంతో పంచుకోలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. తమ లాయర్ వివరాలు మాత్రమే ట్విట్టర్ పంచుకుందని ఆరోపించాయి.

ఇప్పటికే ఇతర సామాజిక మాధ్యమ సంస్థలు ఛీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ సహా.. నోడల్ కాంటాక్ట్ పర్సన్, గ్రీవెన్స్ ఆఫీసర్​ వివరాలను కేంద్రానికి తెలియజేశాయి. ట్విట్టర్​ మాత్రం కేంద్రం హెచ్చరించినప్పటికీ కొత్త నియమాళిని పాటించట్లేదు.

ఇదీ చదవండి:ట్విటర్​కు కేంద్రం మరో స్ట్రాంగ్​ కౌంటర్

Last Updated : May 29, 2021, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.