ETV Bharat / business

'వ్యాక్సిన్​ సాంగ్​'తో గూగుల్​ అవగాహన - వ్యాక్సిన్​ సాంగ్​

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరు టీకా తీసుకోవటం చాలా ముఖ్యం. ప్రజలు వ్యాక్సిన్​ తీసుకునేలా అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం చేసింది గూగుల్​. ఇందుకోసం ఓ పాటను తీసుకొచ్చింది.

google assisatant
గూగుల్​ అసిస్టెంట్
author img

By

Published : May 9, 2021, 5:57 PM IST

కొవిడ్​-19 వ్యాక్సిన్​ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు గూగుల్​ అసిస్టెంట్​ ఓ సరికొత్త పాటను తీసుకొచ్చింది. ఈ పాట ఫన్నీగా ఉండి, అందరినీ ఆకట్టుకునేలా రూపొందించారు. వ్యాక్సిన్లు, అవి సురక్షితం అని తెలిపేలా పాట సాగుతుంది. మహమ్మారిని అరికట్టేందుకు టీకాలు అభివృద్ధి చేసి.. ప్రజలకు అందించిన శాస్త్రవేత్తలను అభినందిస్తూ.. వారిని సూపర్​ హీరోలుగా పాటలో పేర్కొన్నారు.

ఈ పాట వినాలంటే...

గూగుల్​ వ్యాక్సిన్​ పాట వినేలంటే.. మీ ఫోన్​లో గూగుల్​ అసిస్టెంట్​ లేదా స్మార్ట్​ డివైస్​ను వ్యాక్సిన్​ సాంగ్​ పాడమని అడిగితే సరిపోతుంది. మీ డివైస్​లోని సెట్టింగ్​ల ప్రకారం.. గూగుల్​ అసిస్టెంట్​ ఆడ లేదా మగ గొంతుతో వ్యాక్సిన్ పాట పాడుతుంది.

పాటలో లిరిక్స్​ గొప్పగా లేకపోయినా.. వ్యాక్సిన్​ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేలా ఉన్నాయి. టీకా ఘనతను శాస్త్రవేత్తలతో పాటు ఫ్రంట్​లైన్​ వారియర్లకు ఇస్తోంది ఈ పాట.

తమ ఫోన్లు, డివైస్​లలో గూగుల్​ అసిస్టెంట్​ కరోనా సాంగ్​ను విన్న పలువురు నెటిజన్లు ట్విట్టర్​ వేదికగా చిన్న వీడియో క్లిప్​లను పంచుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.