గూగుల్ తాజా ఆవిష్కరణ పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే అక్టోబరులో మన దేశీయ విపణిలోకి ప్రవేశ పెట్టనుంది. అయితే 5జీ సాంకేతికతతో పనిచే పిక్సెల్5, పిక్సెల్ 4ఏ (5జీ)ని మాత్రం భారత్, సింగపూర్ విపణుల్లోకి తీసుకురావడం లేదు.
అద్భుతమైన కెమేరా, ఫీచర్ డ్రాప్స్ వంటి సదుపాయాలు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటాయని గూగుల్ తెలిపింది. 5.8 అంగుళాల తెర, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730జి మొబైల్ ప్లాట్‌ఫామ్, 6జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత మెమొరీ వంటివి ఈ ఫోన్‌లో సదుపాయాలు. ధరను సంస్థ వెల్లడించలేదు.