ETV Bharat / business

డిజిటల్​ ఇండియా కోసం గూగుల్​ రూ.75వేల కోట్ల నిధి - Google CEO Sundar Pichai

Google announced a new $10B digitization fund to help accelerate Indias digital economy
రూ.75 వేల కోట్ల నిధితో డిజిటల్​ ఇండియాకు గూగుల్​ ఊతం
author img

By

Published : Jul 13, 2020, 2:30 PM IST

Updated : Jul 13, 2020, 4:03 PM IST

15:57 July 13

దేశంలో గూగుల్ భారీగా​ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రానున్న ఐదు నుంచి ఏడు ఏళ్లలో భారత్‌లో 75 వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్, ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. 'గూగుల్​ ఫర్​ ఇండియా డిజిటైజేషన్​ ఫండ్'​ ద్వారా ఈ పెట్టుబడులు పెట్టనున్నారు.

తాజా పరిణామాలు దేశ భవిష్యత్​, డిజిటల్​ ఎకానమీపై సంస్థ విశ్వాసానికి ఈ పెట్టుబడులే సంకేతమని 'గూగుల్ ఫర్​ ఇండియా' కార్యక్రమంలో ఉద్ఘాటించారు పిచాయ్. దేశంలో పెట్టుబడులు పెట్టబోతున్నందుకు సంతోషం ఉందన్నారు.

ఆ నాలుగు రంగాలపై దృష్టి...

ఈ పెట్టుబడుల ద్వారా ఇండియా డిజిటైజేషన్​లోని నాలుగు కీలక రంగాలపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు పిచాయ్​.  

  • ప్రతి భారతీయుడు సమాచారాన్ని తమ సొంత భాషలో పొందేలా చూసేందుకు ప్రయత్నం.
  • ప్రత్యేక అవసరాలకు సంబంధించి నూతన ఉత్పత్తులు, సేవలను అందించడం.
  • డిజిటల్​ ట్రాన్స్​ఫర్మేషన్​ ద్వారా వ్యాపారాలను శక్తిమంతం చేయడం.
  • వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో సామాజిక హితం కోసం కృత్రిమ మేధ, సాంకేతిక పరిజ్ఞానం పెంచడం.

14:28 July 13

డిజిటల్​ ఇండియాకు గూగుల్​ ఊతం- 10 బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటు

డిజిటల్​ ఇండియాకు ఊతం ఇచ్చేలా టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు 10 బిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 

"గూగుల్ ఫర్ ఇండియా డిజిటలీకరణ నిధి గురించి ప్రకటించేందుకు సంతోషిస్తున్నా. ఈ నిధి ద్వారా రానున్న 5-7ఏళ్లలో రూ.75వేల కోట్లు లేదా 10 బిలియన్ డాలర్లు భారత్​లో పెట్టుబడి పెడతాం. ఈక్విటీ పెట్టుబడులు, భాగస్వామ్యాలు, మౌలిక వసతుల్లో పెట్టుబడుల రూపంలో ఈ మొత్తం ఖర్చు చేస్తాం"

-సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ

Last Updated : Jul 13, 2020, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.