పిక్సల్ స్లేట్ శ్రేణిలో మరో డివైజ్ తీసుకువచ్చే అవకాశం లేదని గూగుల్ స్పష్టం చేసింది. అంతే కాకుండా టాబ్లెట్లను తీసుకువచ్చే ప్రయత్నాలకు స్వస్తి చెప్పి... కేవలం లాప్టాప్ల అభివృద్ధిపైనే దృష్టి సారించినట్లు గూగుల్ వెల్లడించింది.
"గూగుల్ హార్డ్‌వేర్ టీం లాప్టాప్లను అభివృద్ధి చేసేందుకు మాత్రమే కృషి చేస్తోంది. అయితే ఆండ్రాయిడ్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ టీంలు టాబ్లెట్ భాగస్వాములతో అన్ని విభాగాలతో కలిసి పని చేసేందుకు 100 శాతం నిబద్ధతతో ఉన్నారు. ఇందుకు మేం కూడా పూర్తి మద్దతు ఇస్తున్నాం."
-రిక్ ఒస్టర్లో, గూగుల్ డివైజ్‌లు, సర్వీసుల సీనియర్ ఉపాధ్యక్షుడు
పిక్సల్ స్లేట్‌ను మొదట 2018 అక్టోబర్‌లో ఆవిష్కరించి.. నవంబర్‌లో మార్కెట్లోకి విడుదల చేసింది గూగుల్. దీని ప్రారంభ ధర 599 డాలర్లుగా నిర్ణయించింది. ఇందులో గొప్ప తెర ఉండి మౌస్, ట్రాక్పాడ్లకు సపోర్ట్ చేస్తుందని అయితే క్రోమ్‌బుక్, టాబ్లెట్లతో పోలిస్తే దీని ధర కాస్త ఎక్కువగా ఉందని 'సీనెట్' తెలిపింది. అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ లోపాలు ఉన్నట్లు పేర్కొంది.
గూగుల్ టాబ్లెట్లను నిలిపివేయడం వల్ల ఆ విభాగాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారిని లాప్టాప్ల విభాగంలోకి తీసుకోనుందని కంప్యూటర్ వరల్డ్ సంస్థ నివేదిక తెలిపింది. ఈ బృందం క్రోమ్ ఓఎస్ ఆధారంగా పనిచేసే లాప్టాప్లను అభివృద్ధి చేసే పనిలో ఉందని వెల్లడించింది.
ఇదీ చూడండి : దొంగతనం ఆరోపణలతో ఎయిరిండియా పైలట్‌పై వేటు