బంగారం ధర గురువారం మళ్లీ తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.248 తగ్గి.. రూ.49,714 వద్దకు చేరింది.
వ్యాక్సిన్‌పై వెలువడుతున్న వరుస ప్రకటనలతో మదుపరులు పసిడి నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుని స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధర క్రమంగా దిగొస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు రూ.853 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.61,184 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ.. ఔన్సు బంగారం ధర 1,861 డాలర్లకు తగ్గింది. వెండి ధర స్వల్పంగా తగ్గి.. ఔన్సుకు 24.02 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి:వరుస లాభాలకు బ్రేక్- సెన్సెక్స్ 580 డౌన్