బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర దాదాపు రూ.50 వరకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర రూ.48,704గా ఉంది.
- ఈ నగరాల్లో కేజీ వెండి రూ.64,315 పలుకుతోంది.
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,784.35 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 23.25 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.89 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరుకు 20 పైసలు తగ్గి రూ.97.39 వద్దకు దిగొచ్చింది.
వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.86గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర 19 పైసలు తగ్గి రూ.98.89 వద్దకు చేరింది.
గుంటూరులో పెట్రోల్ ధర లీటర్ రూ.108.08 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ లీటర్‌పై 19 పైసలు తగ్గి రూ.99.07 వద్దకు చేరింది.
ఇదీ చదవండి: హోండా నుంచి కొత్త బైక్.. ధర, ప్రత్యేకతలివే..