బంగారం ధర గురువారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.82 పెరిగి.. రూ.51,153 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ పుంజుకోవడం.. దేశీయంగా ధరల పెరుగుదలకు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర కిలోకు భారీగా రూ.1,074 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,159 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,891 డాలర్లకు పెరిగింది. వెండి ధర స్వల్పంగా పెరిగి.. ఔన్సుకు 24 డాలర్లకు చేరింది.