బంగారం ధర నేడు మళ్లీ పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.43 పెరిగి.. రూ.40,458కి చేరింది.
రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయంగా కొనుగోళ్లు పుంజుకోవడం వంటి పరిణామాలతో దేశీయంగా పసిడి ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.
బంగారంతో పాటే వెండి ధర నేడు పుంజుకుంది. కిలో వెండి ధర నేడు రూ.209(దిల్లీలో) పెరిగి.. రూ.47,406 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,553 డాలర్ల వద్ద.. వెండి ఔన్సుకు 17.83 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉన్నాయి.
ఇదీ చూడండి:'ఆన్-ఆఫ్'తో డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితం!