అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి మారకపు విలువ పడిపోవటం వల్ల బంగారం ధర గురువారం స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రేటు రూ. 31 వృద్ధి చెంది.. రూ.40, 718కు చేరింది.
వెండి ధర స్వల్పంగా క్షీణించింది. కిలో వెండికి (దిల్లీలో) రూ.190 తగ్గి రూ.35,444 వద్దకు చేరింది.
" అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల్లో స్థిరీకరణ, రూపాయి విలువ తగ్గుదలతో నేడు దిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.31 పెరిగింది. "
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ నిపుణులు
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,482 డాలర్లుగా ఉండగా.. వెండి ఔన్సుకు 11.97 డాలర్లుగా ఉంది.