బంగారం ధరలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. నేడు దిల్లీలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.38 వేల 678కి చేరింది. శనివారం ట్రేడింగ్‌లో 10 గ్రాములకు రూ. 38 వేల 560 వద్ద ఉండగా.. ఇవాళ 118 రూపాయల మేర పెరిగింది.
అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల, రూపాయి క్షీణించడమే... ఇందుకు కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కారణంగా... డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నేటి ట్రేడింగ్‌లో 20 పైసలు క్షీణించింది.
పెరిగిన వెండి ధర...
కిలో వెండి ధర రూ. 293 పెరిగి రూ. 45 వేల 263 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,463గా నమోదైంది. వెండి ఔన్సుకు 16.85 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి: ఎంఎంటీఎస్ ప్రమాదంలో 12కు చేరిన క్షతగాత్రుల సంఖ్య