బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.45 పెరిగి.. రూ.44,481కు చేరింది.
కిలో వెండి ధర రూ.116 వృద్ధితో రూ.66,740కు పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,730 డాలర్లుగా ఉంది. వెండి ధర ఔన్సుకు 26.11 డాలర్ల వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు కోలుకోవడం, రూపాయి విలువ బలపడడం కారణంగా బంగారం వెల పెరిగినట్లు మార్కెట్ల్ విశ్లేషకులు తెలిపారు.