బంగారం ధరలు మరింత ప్రియమయ్యాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.32 పెరిగి.. రూ.40,590కి చేరింది.
రూపాయి బలహీనపడటము, అంతర్జాతీయంగా పసిడికి ఉన్న డిమాండు నేపథ్యంలో దేశీయంగా ధరలు పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బంగారంతో పాటే వెండి ధర నేడు పుంజుకుంది. కిలో వెండి ధర నేడు రూ.116 (దిల్లీలో) పెరిగి.. రూ.47,756 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,555 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 18.02 డాలర్లకు చేరింది.