రానున్న రోజుల్లో దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది బడ్జెట్ అనంతరం దేశీయ మార్కెట్లు దిద్దుబాటు చర్యలకు గురవుతాయని.. ఫలితంగా రానున్న 12-15 నెలల్లో మేలిమి పసిడి ధర కొత్త గరిష్ట స్థాయి అయిన రూ.56,500కు చేరుతుందని మోతీలాల్ ఓస్వాల్ అనే ఫైనాన్షియల్ సంస్థ అంచనా వేసింది.
డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ..
కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల సరఫరా- డిమాండ్ల మధ్య వ్యత్యాసం పెరిగిపోయిందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. 2020లో లాక్డౌన్ అనంతరం అధిక డిమాండ్ ఉండగా.. తగినంత సరఫరా లేని కారణంగా గతేడాది బంగారం ధరలు గరిష్ట స్థాయిలో ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేసింది. బడ్జెట్‌లో బంగారం దిగుమతి సుంకంపై కేంద్రం ప్రకటించిన కోత వల్ల కూడా ధరలు ప్రభావితం అవ్వొచ్చని వివరించింది.
ఈ ఏడాది మార్చిలో 160 టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. గతేడాదితో పోలిస్తే దాదాపు 470 శాతం అధికం.
ఇవీ చదవండి: అక్షయ తృతీయ: లాక్డౌన్లోనూ బంగారం కొనండిలా..