బంగారం, వెండి ఫ్యూచర్స్ బుధవారం ఫ్లాట్‌గా ట్రేటింగ్ ప్రారంభించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర అతి స్వల్పంగా రూ.55 పెరిగి.. రూ.48,479 వద్ద ట్రడేవుతోంది. వెండి ధర కిలో రూ.259 పెరిగి..రూ.71,507 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.49,993 వద్ద ఉంది. వెండి ధర కిలో రూ.73,880 వద్ద ఉంది.
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరిగి రూ.96.72 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా 13 పైసలు పెరిగి.. రూ.87.46 వద్ద ఉంది.
హైదరాబాద్‌లోనూ.. పెట్రోల్ ధర రూ.100.52 (+26 పైసలు)కు పెరిగింది. డీజిల్ ధర రూ.95.33 (+14 పైసలు) వద్దకు చేరింది.
గుంటూరులో పెట్రోల్ ధర లీటర్ 26 పైసలు పెరిగి రూ.102.86 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్‌పై 13 పైసలు పెరిగి రూ.97.07 వద్ద ఉంది.
వైజాగ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు(లీటర్‌కు) వరుసగా, 25 పైసలు, 14 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్ పెట్రోల్ ధర రూ.101.66 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.95.91 వద్ద ఉంది.
ఇదీ చదవండి:ద్రవ్యోల్బణానికి ప్రభుత్వాల ఆజ్యం