పసిడి ధరలు గురువారం దాదాపు స్థిరంగా ట్రేడయ్యాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు స్వల్పంగా రూ. 3 పెరిగి.. దేశ రాజధాని దిల్లీలో రూ.39,375కు చేరింది.
వెండి...
బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ వెండి కాస్త దిగొచ్చింది. కిలో వెండి ధర దిల్లీలో రూ. 24 తగ్గి.. రూ.47,120కు చేరుకుంది.
" అమెరికా, చైనాల మధ్య రెండు రోజుల వాణిజ్య చర్చలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు రోజుల్లో ఏదైనా ప్రకటన ఉంటుందని మదుపర్లు ఎదురుచూస్తున్నారు. యూఎస్-చైనా వాణిజ్య చర్చల్లో నెలకొన్న అనిశ్చితితో అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సుకు 1,510డాలర్లకు చేరుకోవటం వల్ల గురువారం పసిడి ధరలు స్థిరంగా ట్రేడయ్యాయి."
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ విశ్లేషకులు.
ఇదీ చూడండి: త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకం- మార్కెట్లకు నష్టం