దేశీయంగా పుత్తడి ధర స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.122 క్షీణించి.. 44,114 దిగొచ్చింది.
వెండి ధరలో కాస్త పెరుగుదల నమోదైంది. కిలో వెండి ధర రూ.587 పెరిగి.. రూ.65,534కు చేరుకుంది.
అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం వల్లే దేశీయంగా పసిడి ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,699డాలర్లు, వెండి ధర 25.31 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: మార్కెట్లకు స్వల్ప లాభాలు- రాణించిన బ్యాంక్ షేర్లు