దేశీయంగా పసిడి ధర స్వల్పంగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి రేటు సోమవారం రూ.19 తగ్గి.. రూ.46,286కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లలో పసిడికి డిమాండ్ తగ్గడం, రూపాయి విలువ పెరగటం వల్లే.. దేశీయంగా బంగారం ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు తెలిపారు.
వెండి ధర(దిల్లీలో) కిలోకు రూ.646 పెరిగి.. రూ.69,072కు ఎగబాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,819 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 27.48 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చదవండి: జనవరిలో పెరిగిన టోకు ద్రవ్యోల్బణం