బంగారం ధర (Gold Rate Today) మంగళవారం స్వల్పంగా తగ్గింది. వెండి ధర (Silver price today) కిలో అతి స్వల్పంగా రూ.50 దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.160కిపైగా తగ్గి.. రూ.47,610 కు చేరింది. కిలో వెండి ధర రూ.62,250 కు చేరింది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.47,610గా ఉంది. కిలో వెండి ధర రూ.62,250 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్‌లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.47,610గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,250గా వద్దకు చేరింది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..
ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,750.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఔన్సు స్పాట్ వెండి ధర 22.62 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్ 19 పైసలు.. డీజిల్(Diesel price today) లీటర్ 27 పైసల చొప్పున పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌కు (Petrol Price in Hyderabad) ధర 19 పైసలు పెరిగి రూ.105.46 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 27 పైసలు ఎగబాకి.. రూ.97.7కు పెరిగింది.
- వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) 19 పైసలు పెరిగి రూ.106.42గా పెరిగింది. లీటర్ డీజిల్ ధర 26 పైసలు పెరిగి రూ.98.16 వద్దకు చేరింది.
- గుంటూరులో పెట్రోల్‌పై 19 పైసలు పెరిగి.. లీటర్ ధర (Petrol Price in Guntur) రూ.107.69కి పెరిగింది. డీజిల్ లీటర్‌పై 26 పైసలు పెరిగి.. రూ.99.39 వద్దకు చేరింది.
ఇదీ చూడండి: BPCL News: 'అయిదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు'