బంగారం, వెండి ఫ్యూచర్స్ గురువారం ఫ్లాట్గా ట్రేడింగ్ ప్రారంభించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్)లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర 1.46 శాతం తగ్గి.. రూ.47,799 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా కిలో 1.59 శాతం తగ్గి రూ.70,332వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.49,300 వద్ద ఉంది. వెండి ధర కిలో రూ.72,779 వద్ద ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్లో.. పెట్రోల్ ధర లీటర్ రూ.100.52 వద్ద, డీజిల్ ధర రూ.95.33 వద్ద ఉంది.
గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా.. రూ.102.86 వద్ద, రూ.97.07 వద్ద ఉన్నాయి
వైజాగ్లో పెట్రోల్ ధర లీటర్ రూ.101.66 వద్ద ఉండగా.. లీటర్కు డీజిల్ ధర రూ.95.91గా ఉంది.
ఇదీ చదవండి:బంగారం కాస్త ప్రియం- పెట్రోల్ రేట్ల కొత్త రికార్డు