ETV Bharat / business

బంగారానికి రెక్కలు-ఏడేళ్ల గరిష్ఠానికి ధరలు

కరోనా సంక్షోభంతో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి ధర నేడు ఏడేళ్ల గరిష్ఠం వద్ద 1,715.25 డాలర్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా లాక్​డౌన్​తో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్న నేపథ్యంలో పసిడిపై పెట్టుబడులకే మదుపరులు మొగ్గుచూపుతుండటం ఇందుకు కారణం.

gold rate in usa
బంగారం ధరలకు రెక్కలు
author img

By

Published : Apr 14, 2020, 3:34 PM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఏడు సంవత్సరాల గరిష్ఠానికి చేరుకుంది. ఈ ఉదయం ఔన్సు బంగారం ధర 1715.25 డాలర్లు పలికింది. ఏడు సంవత్సరాల క్రితం(డిసెంబర్‌ 2012)లో పసిడి ధర 1722.20 డాలర్లుగా నమోదైంది. ఆ తర్వాత పుత్తడి ఇంత ధర పలకటం ఇదే తొలిసారి.

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తితో అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలనున్నాయనే భయాందోళనలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడే సురక్షితమని భావిస్తున్న మదుపరులు, బులియన్‌ మార్కెట్​కు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. ఈ పరిణామాలతో వివిధ దేశాలలో లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ.. బంగారం ధర తారస్థాయికి చేరుకుందని పరిశీలకులు తెలిపారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ ఉన్నా కొత్త కారు కొనుక్కోండిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.