బంగారం ధర బుధవారం భారీగా దిగొచ్చింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.674 తగ్గి.. రూ.51,215 వద్దకు చేరింది.
ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన రూపాయి విలువ.. బుధవారం మళ్లీ పుంజుకోవడం, దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తుండటం వంటివి పసిడి ధర తగ్గుదలకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడికి వ్యతిరేకంగా వెండి ధర మాత్రం బుధవారం కిలోకు స్వల్పంగా రూ.126 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.63,427 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,892 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 23.73 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి:ఐదో రోజూ అదే జోరు- సెన్సెక్స్@39,879