బంగారం ధర మరింత దిగొచ్చింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర సోమవారం అతి స్వల్పంగా రూ.15 తగ్గి.. రూ.44,949 వద్దకు చేరింది.
వెండి ధర కూడా కిలోకు(దిల్లీలో) రూ.216 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.64,222 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,727 డాలర్లకు దిగొచ్చింది. వెండి ఔన్సుకు 24.78 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చదవండి:శాంసంగ్ నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు