దేశ కరెంటుఖాతా లోటు పెరిగేందుకు కారణమవుతున్న బంగారం దిగుమతులు ఏప్రిల్-నవంబరులో 1230 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. 2019-20 ఇదే కాలం దిగుమతులు 2060 కోట్ల డాలర్లతో పోలిస్తే, ఈసారి 40 శాతం తగ్గినట్లయ్యింది. కొవిడ్ నేపథ్యంలో, గిరాకీ తగ్గడం ఇందుకు కారణంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అయితే ఒక్క నవంబరులో చూస్తే 300 కోట్ల డాలర్ల విలువైన బంగారం దిగుమతైంది. 2019 నవంబరు దిగుమతుల కంటే ఇది 2.65 శాతం అధికం. ఇదేవిధంగా వెండి కూడా ఏప్రిల్-నవంబరులో 75.20 కోట్ల డాలర్ల విలువైనది దిగుమతైంది. 2019 ఇదే సమయం దిగుమతులతో పోలిస్తే ఇది 65.7 శాతం తక్కువ. విలువైన లోహాల భారం తగ్గడంతో, ఏప్రిల్-నవంబరు వాణిజ్యలోటు కూడా 4200 కోట్ల డాలర్లకు పరిమితమైంది. 2019 ఇదే సమయంలో లోటు 11,342 కోట్ల డాలర్లు కావడం గమనార్హం.
ఇదీ చూడండి: జనవరిలో హోండా కార్ల ధరలు పెంపు