బంగారం ధర సోమవారం భారీగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.877 ఎగిసి.. రూ.50,619 వద్దకు చేరింది.
డాలర్ విలువ క్షీణిస్తున్న కారణంగా పసిడి ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కిలోకు(దిల్లీలో) భారీగా రూ.2,012 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.69,454 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,935 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 27.30 డాలర్ల వద్దకు చేరింది.
ఇదీ చూడండి:ఇక భారత్‌లోనూ లెనోవో టాబ్లెట్ల తయారీ