బంగారం ధర శుక్రవారం మళ్లీ పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.286 ఎగిసి.. రూ.48,690 వద్దకు చేరింది.
'అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో రూపాయి క్షీణిస్తుండటం.. దేశీయంగా పసిడి ధరల వృద్ధికి కారణం' అని విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కిలోకు(దిల్లీలో) రూ.558 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.65,157 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,852 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 25.40 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి:వారాంతంలో భారీ నష్టాలు- ఐటీ షేర్లు కుదేలు