బంగారం ధర గురువారం రూ.232 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 50,184 వద్దకు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం వల్ల పసిడిపై పెట్టుబడులు పెరిగి.. ధరలు ఈ స్థాయిలో పుంజుకుంటున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వెండి ధర కిలోకు ఏకంగా రూ.1,275 (దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.52,930 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,813 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 18.94 డాలర్లుగా ఉంది
ఇదీ చూడండి:ఇన్‌స్టా సహా ఆ 89 యాప్‌లపై సైన్యం నిషేధం