బంగారం ధర బుధవారం కాస్త పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.190 పెరిగి.. రూ.51,220 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేయడం, రూపాయి విలువ తగ్గుతుండటం వంటి కారణాలతో.. పసిడి ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు రూ.342 పెరిగి. కిలో ధర ప్రస్తుతం రూ.62,712 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఔన్సు బంగారం ధర 1,906.70 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్సుకు 24.45 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి:నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు- 40వేల దిగువకు సెన్సెక్స్