బంగారం ధర శుక్రవారం స్వల్పంగా రూ.75 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 51,069కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ తగ్గడం వల్లే దేశీయంగా ధరలు క్షీణించినట్టు విశ్లేషకులు చెప్పారు.
పసిడికి భిన్నంగా వెండి రేటు స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ. 121 పెరిగి.. ప్రస్తుతం రూ. 62,933గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,908 డాలర్లకు తగ్గింది. వెండి ధర ఔన్సుకు 24.72 డాలర్లుగా ఉంది.
ఇదీ చదవండి: వాట్సాప్లో ఆ నోటిఫికేషన్స్ ఇక ఎప్పటికీ రావు!