బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.83 పెరిగి.. రూ.45,049 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా పెరిగిన పుత్తడి ధరలు ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు స్వల్పంగా రూ.62 పెరిగి.. 64,650 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,733 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 24.97 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చదవండి:ఆద్యంతం ఒడుదొడుకులు- చివరకు స్వల్ప లాభాలు