ETV Bharat / business

మస్క్‌, బెజోస్‌ను మించి అదానీ సంపద వృద్ధి! - రికార్డు స్థాయిలో అదానీ సంపద వృద్ధి

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధికంగా సంపదను పెంచుకున్న పారిశ్రామిక దిగ్గజంగా భారత్​కు చెందిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్​​ అదానీ నిలిచారు. 2021 జనవరి నుంచి ఆయన సంపద రూ.1.2 లక్షల కోట్లు పెరిగినట్లు బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. ఈ విషయంలో ఎలాన్‌ మస్క్‌, బెజోస్‌ కంటే అదానీ ముందు వరుసలో ఉన్నట్లు వివరించింది.

worlds biggest wealth gainer is Adani
భారీగా పెరిగిన అదానీ సంపద
author img

By

Published : Mar 12, 2021, 7:31 PM IST

భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ సంపాదన భారీగా పెరిగింది. అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకోవడం వల్ల ఈ ఏడాది(2021)లో అతి ఎక్కువ సంపదను ఆర్జించిన వ్యక్తిగా నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో నంబర్‌ 1 స్థానానికి పోటీ పడుతున్న ఎలాన్‌ మస్క్‌, జెఫ్​ బెజోస్‌ కంటే అదానీ ఈ విషయంలో ముందున్నారు.

అదానీ ఆస్తి ఎంతంటే..

ఈ ఏడాది ప్రారంభం నుంచి అదానీ నికర ఆస్తి 16.2 బిలియన్‌ డాలర్లుగా(రూ.1.2 లక్షల కోట్లపైమాటే) పెరిగి.. 50 బిలియన్‌ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. భారత్‌కు చెందిన మరో కుబేరుడు ముకేశ్‌ అంబానీ సంపాదన ఇదే సమయంలో 8.1 బిలియన్ల డాలర్లు పెరగడం గమనార్హం. అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు ఒకటి మినహా మిగిలినవన్నీ తక్కువలో తక్కువ 50 శాతం మేర దూసుకెళ్లడం వల్ల అదానీ సంపాదన 2021లో ఈ స్థాయిలో పెరిగింది.

అదానీ వ్యాపారాలు..

అదానీకి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, కోల్‌మైన్స్‌, పవర్‌ ప్లాంట్లు వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలున్నాయి. ఇటీవల 1 గిగావాట్‌ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ను దేశంలో ఏర్పాటు చేసేందుకు సైతం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ముందుకొచ్చింది. దీంతో సాంకేతిక రంగంలోనూ అదానీ గ్రూప్‌ అడుగుపెట్టినట్లయ్యింది. ఈ ఒక్క ఏడాదిలో అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ షేర్లు 96 శాతం మేర పెరగ్గా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 90%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 79% మేర దూసుకెళ్లాయి. ఇక అదానీ పవర్‌ లిమిటెడ్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్స్‌ లిమిటెడ్‌ వంటి కంపెనీల షేర్లు 52% మేర రాణించాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఒక్కటి మాత్రమే 12% వృద్ధి చెందింది. గతేడాది ఈ కంపెనీ షేరు 500% మేర పెరగడం గమనార్హం.

ఇదీ చదవండి:పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం- ఐఐపీ నేల చూపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.