ETV Bharat / business

ఫ్యూచర్​ రిటైల్​ వాటాల విక్రయానికి రిలయన్స్​తో చర్చలు! - ఫ్యూచర్ రిటైల్ వాటాల విక్రయం

ఫ్యూచర్ గ్రూప్‌లోని కొన్ని కంపెనీల్లో వాటాను కొనుగోలు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరుపుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశాయి. ఒక వేళ ఒప్పందం కుదిరితే.. ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు కిశోర్ బియానీకి రుణభారం నుంచి పెద్ద ఉపశమనం కలిగే అవకాశముంది.

Future Group in advance talks with RIL to sell stake in Future Retail, other units
ఫ్యూచర్​ రిటైల్​ వాటాల విక్రయానికి రిలయన్స్​తో చర్చలు!
author img

By

Published : Jun 18, 2020, 10:40 PM IST

ఈ కామర్స్ రంగంలో తన కలలను నెరవేర్చుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఫ్యూచర్ గ్రూప్​లోని కొన్ని యూనిట్లలో వాటాలు కొనుగోలు చేసేందుకు ముందస్తు చర్చలు జరుపుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే అమెజాన్​.కామ్​తో భాగస్వామ్యం ఉన్న కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్​... రిలయన్స్ ఇండస్ట్రీస్​తో వాటాల విక్రయంపై చర్చలు జరిపింది. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకు ముందు ఫ్యూచర్ రిటైల్​ వాటాలను ప్రేమ్​జీ ఇన్​వెస్ట్​, సమారా క్యాపిటల్​ల​కు విక్రయించేందుకు కూడా అశోక్ బియానీ చర్చలు జరిపారు.

రిలయన్స్​ ఇండస్ట్రీస్​తో ఒప్పందం ఖరారైతే మాత్రం ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు కిశోర్ బియానీకి రుణభారం నుంచి గొప్ప ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఆయన మార్చిలో రుణాలపై డిఫాల్ట్ ప్రకటించారు.

ఊహాగానాలు వద్దు

ఫ్యూచర్​ గ్రూప్​లో వాటా కొనుగోలు విషయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్​ అన్ని ప్రాధాన్యాలను పరిశీలిస్తోందని ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఫ్యూచర్ గ్రూప్ అధికార ప్రతినిధి దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

ఫ్యూచర్​ గ్రూపులో 5 ప్రధాన లిస్టెడ్​ యూనిట్లు ఉన్నాయి. వీటిలో ఫ్యూచర్ కన్జ్యూమర్ లిమిటెడ్ ఒకటి. ఇది ఆహారం, గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఫ్యూచర్ లైఫ్​స్టైల్​ ఫ్యాషన్స్ లిమిటెడ్​... ఫ్యాషన్ దుస్తులు, వస్తువులు అమ్మే బ్రాండ్ ఫ్యాక్టరీని నిర్వహిస్తుంటుంది.

అమెజాన్ వర్సెస్ రిలయన్స్

ఫ్యూచర్​ గ్రూప్​ వాటాలను ముకేశ్​ అంబానీ సొంతం చేసుకుంటే... ఈ-కామర్స్ రంగంలో అమెజాన్,​ రిలయన్స్​ల మధ్య భారీ పోటీ అనివార్యమవుతుంది. ముఖేశ్ అంబానీ తన ఈ-కామర్స్ వెంచర్ జియో ఫ్లాట్​ఫామ్స్​ లిమిటెడ్​ కోసం ఇప్పటికే దాదాపు 14 బిలియన్​ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగలిగారు.

మరోవైపు భారతీయ మార్కెట్​లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు అమెజాన్​ కూడా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ వినియోగదారులు ఉన్నారు.

కిశోర్ బియానీకి రుణ విముక్తి!

రిలయన్స్ ఇండస్ట్రీస్​.. ఫ్యూచర్ గ్రూప్​లో వాటాలు కొనుగోలు చేస్తే... ఆ సంస్థ వ్యవస్థాపకుడు కిశోర్​ బియానీపై రుణాల భారం తగ్గిపోతుంది.

ఫ్యూచర్ రిటైల్​ 400 నగరాల్లో 1500 రిటైల్ దుకాణాలను నిర్వహిస్తోంది. ఇది పెద్ద ఫార్మాట్ స్టోర్లు, బిగ్​ బజార్, ఈజీ డే క్లబ్​, హెరిటేజ్ ఫ్రెష్, సహా రిటైల్ చైన్స్ కలిగి ఉంది. ప్రమోటర్ అండ్ ప్రమోటర్​ గ్రూప్​ 2020 మార్చి 31 నాటికి ఫ్యూచర్ రిటైల్​లో 40.31 శాతం వాటా కలిగి ఉంది.

స్టాండర్డ్ అండ్ పూర్స్​, ఫిచ్​ లాంటి రేటింగ్ ఏజెన్సీలు.... ఫ్యూచర్ రిటైల్​ క్రెడిట్​ రేటింగ్​ను డిఫాల్ట్ చేశాయి. దీనితో కిశోర్ బియానీకి... ఫ్యూచర్ గ్రూప్ వాటాల విక్రయం తప్పనిసరి అయ్యింది.

మరోవైపు రిలయన్స్ రిటైల్​.. దేశవ్యాప్తంగా 11,784 దుకాణాలను నిర్వహిస్తోంది. జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.38,211 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది.

ఇదీ చూడండి: ట్విట్టర్ సరికొత్త ఫీచర్​​.. 'ఆడియో' ట్వీట్లకు వేళాయెరా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.