ETV Bharat / business

నేటి నుంచి మారేవి ఇవే..

డిసెంబరు 1 నుంచి సామాన్యులను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆర్థికపరంగా ప్రభావితం చేసే కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటి వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అందుబాటులో ఉన్న ఆర్టీజీఎస్ సేవలు ఈరోజు నుంచి 24 గంటలు అందుబాటులో ఉంటాయి. కొద్దినెలలుగా స్థిరంగా ఉన్న వంట గ్యాస్ సిలిండర్​​ ధరలు మారే అవకాశాలున్నాయి. ఎటీఎంలలో ఓటీపీ ఆధారిత విత్​డ్రా సేవలను పీఎన్​బీ నేటి నుంచే ప్రారంభించనుంది.

From RTGS timings to LPG prices, here's what changes from 1 December
నేటి నుంచి మారేవి ఇవే..
author img

By

Published : Dec 1, 2020, 5:41 AM IST

ఆర్థికపరమైన విషయాల్లో సామాన్యుల జీవితాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేసే పలు అంశాలు మంగళవారం నుంచి మారనున్నాయి. ఆర్టీజీఎస్​ లవాదేవీలు ఇక నుంచి 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి. వంటగ్యాస్ సిలిండర్​ ధరలు మారే అవకాశముంది. ఏటీఎంల నుంచి ఓటీపీ ఆధారిత విత్​డ్రా సేవలను పంజాబ్​ నేషనల్ బ్యాంక్ ఈరోజు నుంచే ప్రారంభించనుంది.

24x7 లావాదేవీలు..

రియల్ టైమ్ గ్రాస్ సెటిల్​మెంట్(ఆర్​టీజీఎస్​) సేవలు ఈరోజు నుంచి 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పని దినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారీ మొత్తాల చెల్లింపుల వ్యవస్థలో ఆవిష్కరణలను సులభతరం చేయడానికి, వ్యాపారం చేసే సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి ఆర్‌బీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఆర్​టీజీఎస్​ అనేది తక్షణ నగదు బదిలీ వ్యవస్థ. కనీసం రూ.2 లక్షల నుంచి నగదు బదిలీకి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. గరిష్ఠ మొత్తం అనేది బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది.

వంటగ్యాస్ సిలిండర్​ ధర పెరుగుతుందా?

వంటగ్యాస్ ధరలకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ నేటి నుంచి మారే అవకాశాలున్నాయి. కరోనా నేపథ్యంలో సామన్యులపై భారం మోపకూడదనే ఉద్ధేశంతో కొద్ది నెలలుగా ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు మార్చలేదు. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు కరోనా ముందుకాలం నాటికి పెరుగుతుండటం వల్ల వంటగ్యాస్ సిలిండర్​ ధర కూడా పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి.

ఓటీపీ ఆధారిత విత్​డ్రా..

ఏటీఎంలలో అనధికారిక లావాదేవీలను తగ్గించేందుకు నేటి నుంచే ఓటీపీ ఆధారిత విత్​డ్రా వ్యవస్థను ప్రారంభించనుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్​. వినియోగదారులు ఇక నుంచి రూ.10వేలకు మించి నగదు విత్​డ్రా చేయాలనుకుంటే తమ రిజిస్టర్డ్​ మొబైల్​ నంబర్​కు వచ్చిన ఓటీపీని ఎటీఎంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రూ. 10వేల లోపు విత్​డ్రా చేసుకునే వారికి ఈ నిబంధన వర్తించదని పీఎన్​బీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఓటీపీ ఆధారిత విత్​డ్రాకు అవకాశం ఉంటుంది.

ఇదీ చూడండి: '2026 నాటికి భారత్​లో 35కోట్ల 5జీ కనెక్షన్​లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.