ETV Bharat / business

Mastercard: ఈ బ్యాంకులపై 'మాస్టర్‌' ఎఫెక్ట్‌! - రూపే కార్డు

భారతీయ రిజర్వ్​ బ్యాంక్​ తాజాగా మాస్టర్​ కార్డ్​పై చర్యలకు ఉపక్రమించింది. దీంతో ఆ ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్న ఐదు ప్రవేటు రంగ బ్యాంకులపై పడనుంది. దీంతో ఆయా బ్యాంకులు కార్డుల జారీలో ఇబ్బందులు పడనున్నాయని ప్రముఖ గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనా వేసింది.

Mastercard
ఈ బ్యాంకులపై 'మాస్టర్‌' ఎఫెక్ట్‌
author img

By

Published : Jul 17, 2021, 4:59 AM IST

Updated : Jul 17, 2021, 6:39 AM IST

మాస్టర్‌ కార్డుపై ఆర్‌బీఐ చర్యల నేపథ్యంలో దేశంలో సేవలందిస్తున్న ఐదు ప్రైవేటురంగ బ్యాంకులపై ప్రభావం పడనుంది. లోకల్‌ డేటా స్టోరేజీ నిబంధనలు పాటించని కారణంగా కొత్త కార్డుల జారీ విషయంలో ఆర్‌బీఐ మాస్టర్‌ కార్డుపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా బ్యాంకులు కార్డుల జారీలో ఇబ్బందులు పడనున్నాయని ప్రముఖ గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనా వేసింది. ఆంక్షల నేపథ్యంలో కొత్త పేమెంట్‌ గేట్‌ వేకు మారడానికి బ్యాంకులకు 2-3 నెలలు సమయం పట్టనుందని పేర్కొంది.

మాస్టర్‌ కార్డుపై చర్యల నేపథ్యంలో ప్రైవేటు రంగ బ్యాంకులైన ఆర్‌బీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లపై ప్రభావం పడనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా మాస్టర్‌ కార్డుపై ఆధారపడుతున్నప్పటికీ ఇప్పటికే ఆ బ్యాంక్‌ కొత్త కార్డుల జారీ విషయంలో ఆర్‌బీఐ నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్తగా ఎలాంటి ప్రభావం ఉండబోదు. ఈ బ్యాంకులతో పాటు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ కార్డు పైనా ప్రభావం ఉండనుంది.

మాస్టర్‌కార్డుపై ఈ సంస్థలు పెద్దఎత్తున ఆధారపడుతుండడంతో కొత్త కార్డుల జారీ విషయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందని నొమురా పేర్కొంది. సాంకేతికతతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల కొత్త పేమెంట్‌ గేట్‌వే విషయంలో రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌ వంటివి దాదాపు మాస్టర్‌కార్డుపైనే ఆధారపడుతుండడం ఈ బ్యాంకులపై ఎక్కువ ప్రభావం ఉండనుందని పేర్కొంది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ దాదాపు 35 నుంచి 40 శాతం వరకు మాస్టర్‌ కార్డుపై ఆధారపడుతున్నాయి. ఎస్‌బీఐ కార్డ్‌ 10 శాతం మాత్రమే ఆధారపడి ఉండడంతో పెద్దగా ఇబ్బంది ఉండబోదు. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ పూర్తిగా వీసా కార్డులపై ఆధారపడి ఉండడంతో ఆ బ్యాంక్‌పై ఎలాంటి ప్రభావం ఉండబోదు. మాస్టర్‌ కార్డులపై చర్యల నేపథ్యంలో కొత్త కార్డుల జారీకి వీసాతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇప్పటికే మాస్టర్‌ కార్డు వాడుతున్న వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవు.

ఇదీ చూడండి: రిలయన్స్​ చేతికి 'జస్ట్​ డయల్'​.. 41% వాటా సొంతం!

Last Updated : Jul 17, 2021, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.