దాదాపు రెండు నెలల విరామం తర్వాత మార్కెట్లో ఐపీఓలు సందడి చేయనున్నాయి. ఏప్రిల్ తర్వాత తొలిసారి నాలుగు కంపెనీలు ఓకే వారం ఐపీఓకు రానున్నాయి. ఈ కంపెనీలన్నీ రూ.9,123 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో రెండు సంస్థలు తెలుగు రాష్ట్రాల నుంచే కావడం గమనార్హం.
ఈ ఏడాది చివరి సారిగా.. ఏప్రిల్ 7 నుంచి 9 మధ్య మాక్రోటెక్ డెవలపర్స్ ఐపీఓకు వచ్చింది.
ఈ వారం ఐపీఓకు రానున్న కంపెనీలు..
శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్, సోనా కామ్స్టర్స్ సంస్థలు సోమవారం ఐపీఓ రానున్నాయి. 16న ఐపీఓ ముగియనుంది. కిమ్స్, దొడ్ల డెయిరీ ఈ నెల 16న ఐపీఓ ప్రారంభించనున్నాయి. 18న వీటి ఐపీఓ ముగియనుంది.
శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్
ఇండిగ్రేటెడ్ మెటల్స్ ఉత్పత్తి సంస్థ అయిన శ్యామ్ మెటాలిక్స్.. ఐపీఓ ద్వారా రూ.909 కోట్లు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ షేరు ప్రైస్ బ్యాండ్‌ను రూ.303-306 మధ్య ఉంచింది.
సొనా కోమర్స్
ఆటో మొబైల్ విడిభాగాల తయారీ సంస్థ సోనా కామ్స్టర్స్.. రూ.5,250 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. షేర్ బ్యాండ్ ధరను రూ.285-291గా నిర్ణయించింది.
కిమ్స్..
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న కిమ్స్ (క్రిష్ణ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్) రూ.2,144 కోట్లను సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. 2,35,60,538 ఈక్విటీ షేర్లను ఇందులో విక్రయించనుంది. షేరు ప్రైస్ బ్యాండ్‌ను రూ.815-825గా నిర్ణయించింది కిమ్స్.
దొడ్ల డెయిరీ..
హైదరాబాద్‌కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ దొడ్ల డెయిరీ కూడా రూ.520 కోట్లు సమీకరించే లక్ష్యంతో 1,09,85,444 షేర్లను ఇష్యూ చేయనుంది. షేరు ప్రైస్ బ్యాండ్‌ను రూ.421-428 మధ్య నిర్ణయించింది కంపెనీ. దొడ్ల డెయిరీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలోనూ కార్యకలాపాలు సాగిస్తోంది.
ఇదీ చదవండి: