వరసగా ఏడో సెషన్లోనూ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మార్చి నెలాఖరున డెరివేటివ్ క్రాంటాక్టుల ముగింపుతో సూచీలు లాభాల బాటలో పయనిస్తున్నాయి.
73 పాయింట్లు వృద్ధితో ప్రారంభమయిన సెన్సెక్స్ ప్రస్తుతం 32 పాయింట్ల లాభంతో 38,127 వద్ద ట్రేడవుతోంది. 7 పాయింట్ల లాభంతో నిఫ్టీ 11,469 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో ఉన్నవి
సన్ ఫార్మా, ఓఎన్జీసీ, ఎస్బీఐ, యెస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్సీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
నష్టాల్లో ఉన్నవి
హీరో మోటర్ కార్ప్, బజాజ్ ఆటో, ఎల్ &టీ, వేదాంత సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
విదేశీ నిధుల ప్రవాహంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నందున భారత మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే నేడు జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయ కమిటీ సమావేశం మార్కెట్లపై కొంతమేర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.