ETV Bharat / business

ఫోర్డ్‌-మహీంద్రా జాయింట్​ వెంచర్​ ఒప్పందం రద్దు - భారత ఆటోమోబైల్ దిగ్గజం

భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్​ మహీంద్రా.. అమెరికాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఫోర్డ్​ల మధ్య ఖరారు కావాల్సిన ఒప్పందాన్ని (జాయింట్​ వెంచర్)​ రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాయి. కరోనాతో ప్రపంచ విపణిలో తలెత్తిన ప్రతికూల ప్రభావం వల్ల ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని దిగ్గజ సంస్థలు ప్రకటించాయి.

Ford, Mahindra to scrap proposed automotive joint venture
ఫోర్డ్‌-మహీంద్రా జాయింట్​ వెంచర్​ రద్దు
author img

By

Published : Jan 1, 2021, 10:05 PM IST

భారత్‌లో ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రాతో ఖరారు కావాల్సిన జాయింట్‌ వెంచర్‌(జేవీ) ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికాకు చెందిన వాహన ఉత్పత్తి సంస్థ ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ ప్రకటించింది. ప్రణాళిక ప్రకారం.. ఈ ఒప్పందం గురువారమే ఖరారు కావాల్సి ఉంది. కానీ, కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ విపణిలో తలెత్తిన ప్రతికూల ప్రభావం వల్ల ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని ఇరు సంస్థలు ప్రకటించాయి. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల్ని అధిగమించేందుకు తమ పెట్టుబడుల ప్రాధాన్యతల్ని ఫునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఇరు సంస్థలు అభిప్రాయపడ్డాయి.

అయితే భారత్​లో తమ కార్యకలాపాలు కొనసాగుతాయని ఫోర్డ్ ప్రకటించింది. మరోవైపు ఈ ఒప్పందం రద్దు నిర్ణయం తమ కంపెనీ ఉత్పత్తి, ప్రణాళికపై ఎలాంటి ప్రభావం చూపదని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.

ఇరు సంస్థలు భారత్‌లో జేవీని నెలకొల్పాలని అక్టోబర్‌ 2019లో ఒక అంగీకారానికి వచ్చాయి. ఖర్చులు తగ్గించుకునే నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ప్రకటించాయి. జేవీ ప్రారంభమైన వెంటనే ఇరు కంపెనీల సంయుక్త భాగస్వామ్యంలో మధ్యశ్రేణి ఎస్‌యూవీలను తీసుకురానున్నట్లు తెలిపాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కోసం విద్యుత్తు వాహనాలను కూడా తయారు చేయాలని నిర్ణయించాయి. అప్పటి నుంచి ఇరు సంస్థలు మధ్య సంప్రదింపులు కొనసాగాయి. కానీ, మహమ్మారి రాకతో వాటిపై ప్రభావం పడింది.

ఇదీ చదవండి: ఐయూసీ రద్దుతో జియోకే నష్టం!

ఫోర్డ్ ప్రణాళికలు..

పెరుగుతున్న డిమాండ్​కు అనుగుణంగా మరింత మంది వినియోగదారులకు చేరువ కావడమే లక్ష్యంగా ఫోర్డ్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా అధిక నాణ్యతతో కూడిన వాహనాలతో పాటు.. ఎలక్ట్రిక్, హైఎండ్​ మోడళ్లను ఉత్పత్తి చేయనుంది. అందుబాటు ధరలతో పాటు, విసృత సేవలను అందించనుంది. పోటీని తట్టుకునేందుకు తమ ప్లాంట్​లను ఆధునీకీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఉన్న వనరులను పటిష్ఠ పరుచుకుంటూ.. పెట్టుబడిని రెట్టింపు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇక సంప్రదాయ ఆటోమొబైల్​ పరిశ్రమలో నైపుణ్యాన్ని పెంపొందించుకొనేందుకు ఇతర కంపెనీలతో జత కట్టాలని యోచిస్తోంది.

మార్కెట్​లో పైచేయి సాధిస్తాం..

ఫోర్డ్​ ఒప్పందం రద్దు తమ కంపెనీ ఉత్పత్తి ప్రణాళికపై ఎలాంటి ప్రభావం చూపదని ఎం అండ్ ఎం తెలిపింది. ఈ మేరకు నియంత్రణ సంస్థకు ఇచ్చిన సమాచారంలో స్పష్టం చేసింది. స్పోర్ట్స్ యుటిలిటీ కార్లు (ఎస్‌యూవీ) తమకు ప్రధాన మార్కెట్ అని.. వీటి ఉత్పత్తిపై దృష్టి సారిస్తూనే తమ ఆర్థిక పనితీరుని మెరుగుపరచుకుంటామని తెలిపింది. ప్రస్తుతం కంపెనీ అమ్మకాలు పుంజుకుంటున్నాయని.. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎస్‌యూవీలలో సింహభాగం అమ్మకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది.

కరోనాతో తప్పిన లెక్కలు..

గత 15 నెలల్లో వ్యాపార సరళిలో ఊహించని మార్పులు.. కరోనా విజృంభణతో ప్రపంచ ఆర్థిక విపణిలో ఒడుదొడుకులు తమ మూలధన కేటాయింపులను ప్రభావితం చేశాయని ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఈ క్రమంలో మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల్ని అధిగమించేందుకు తమ పెట్టుబడుల ప్రాధాన్యతల్ని ఫునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి. అక్టోబర్ 2019లో ప్రకటించిన ఒప్పందంలో భాగంగా.. ఫోర్డ్ మోటార్స్ భారత విభాగంలో మెజారిటీ వాటాను(51శాతం) ఎం అండ్ ఎం కొనుగోలు చేయాల్సి ఉంది. భారతదేశంలో ఫోర్డ్ బ్రాండ్ వాహనాల అభివృద్ధి, పంపిణీతో పాటు.. అధిక డిమాండ్​ ఉన్న మార్కెట్లలో విక్రయించాలనే నిబంధన సైతం ఉంది.

ఇదీ చదవండి: క్యూ2లోనూ పెరిగిన కేంద్రం అప్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.