ETV Bharat / business

10 నిమిషాల్లోనే జొమాటో డెలివరీ! రిస్క్ కాదా? క్వాలిటీ సంగతేంటి? - జొమాటో పది నిమిషాల డెలివరీ సాధ్యమేనా?

Zomato 10-minute food delivery plan: 'ఫుడ్​ ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే డెలివరీ!'.. ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సేవల సంస్థ జొమాటో కొత్త ప్లాన్ ఇది. వినడానికి ఎంతో బాగున్నా.. ఈ ప్రకటన ఎన్నో ప్రశ్నలకు తావిచ్చింది. అసలు 10 నిమిషాల్లో ఫుడ్​ తయారు చేసి, ప్యాక్ చేసి, కస్టమర్​ ఇంటికి చేర్చడం సాధ్యమేనా? క్వాలిటీ, టేస్ట్ బాగుంటాయా? అన్నింటికన్నా ముఖ్యంగా.. జొమాటో డెలివరీ బాయ్స్ భద్రత సంగతేంటి?

zomato
జుమాటో
author img

By

Published : Mar 22, 2022, 2:36 PM IST

Zomato 10-minute food delivery plan: జొమాటో.. భారతీయ స్టార్టప్​ విజయగాథల్లో ముఖ్యమైనది. 2008లో భారత్​లో ఓ చిన్న అంకుర సంస్థగా ప్రారంభమై.. ఇప్పుడు అనేక దేశాల్లో దిగ్గజ రెస్టారెంట్ అగ్రిగేటర్​గా రాణిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రత్యర్థి సంస్థలకు దీటుగా సేవల్ని మెరుగుపరుచుకుంటూ.. అంతకంతకూ విస్తరిస్తోంది. ఇదే క్రమంలో సోమవారం ఓ కీలక ప్రకటన చేసింది ఆ సంస్థ. అదే జొమాటో ఇన్​స్టంట్​.

  • Announcement: 10 minute food delivery is coming soon on Zomato.

    Food quality – 10/10
    Delivery partner safety – 10/10
    Delivery time – 10 minutes

    Here’s how Zomato Instant will achieve the impossible while ensuring delivery partner safety – https://t.co/oKs3UylPHh pic.twitter.com/JYCNFgMRQz

    — Deepinder Goyal (@deepigoyal) March 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఏంటీ జొమాటో ఇన్​స్టంట్​?

ప్రస్తుతం జొమాటోలో ఏదైనా ఆర్డర్ చేస్తే డెలివరీ చేసేందుకు సగటున 30 నిమిషాలు పడుతుంది. అయితే.. పదంటే పది నిమిషాల్లోనే ఆ పని పూర్తి చేసేందుకు జొమాటో ఇన్​స్టంట్​ విధానాన్ని తెస్తున్నట్లు ప్రకటించారు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్. ప్రపంచంలో ఎవ్వరూ ఇలా 10 నిమిషాల్లోనే ఆహారం డెలివరీ చేయడం లేదని, తాము చేసి చూపిస్తామని ఓ బ్లాగ్ పోస్ట్​లో పేర్కొన్నారు. జొమాటో ఇన్‌స్టంట్‌ను ఏప్రిల్‌ నుంచి గురుగ్రామ్‌లోని 4 స్టేషన్‌ల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

10 నిమిషాల్లో ఎలా సాధ్యం?

'10 మినిట్స్​లో డెలివరీ' సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే.. ఆర్డర్​ చేసిన 10 నిమిషాల్లోనే మనకు కావాల్సిన ఆహారం ఇంటికి చేరుతుందన్న ఆనందం కన్నా.. అనుమానాలకే ఈ ప్రకటన ఎక్కువ కారణమైంది.

10 నిమిషాల్లో డెలివరీ సాధ్యమేనా? తాజా ఆహారాన్నే అందిస్తారా? ఎప్పుడో వండి పెట్టిన ఆహారాన్ని ఒవెన్​లో వేడి చేసి పంపిస్తారా? ట్రాఫిక్ చక్రవ్యూహాన్ని జొమాటో డెలివరీ బాయ్స్​ ఎలా చేధించగలరు? 10 నిమిషాల టార్గెట్​ కోసం వారు రోడ్డుపై ప్రమాదకరంగా బైక్​ నడిపితే ఏంటి పరిస్థితి?... ఇలా ఎన్నో ప్రశ్నలు. జొమాటో ప్రకటనను తప్పుబడుతూ మరెన్నో మీమ్స్​ నెట్టింట హల్​చల్​ చేస్తున్నాయి.

క్లారిటీ ఇచ్చిన గోయల్

ఫుడ్​ డెలివరీ రంగంలో జొమాటో ఇన్​స్టంట్​ సూపర్​ హిట్​ అవుతుందని ఆశించిన గోయల్.. నెట్టింట వచ్చిన రియాక్షన్​తో వెంటనే అప్రమత్తం అయ్యారు. 10 నిమిషాల డెలివరీ ఎలా సాధ్యమన్న ప్రశ్నలకు మంగళవారం ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు.

దీపిందర్ గోయల్ వివరణలోని కీలకాంశాలు:

  • ఆర్డర్​ చేసిన వ్యక్తి ఇంటికి అతిదగ్గర్లోని కొన్ని రెస్టారెంట్లు, అక్కడ లభించే కొన్ని వంటకాలకు మాత్రం 10 నిమిషాల డెలివరీ వర్తిస్తుంది.
  • రెస్టారెంట్​ 2 నిమిషాల్లోనే అందించగల కొన్ని పాపులర్ వంటకాలకు మాత్రమే జొమాటో ఇన్​స్టంట్​ వర్తిస్తుంది. ఉదాహరణకు.. మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, పోహా, కాఫీ, చాయ్, బిర్యానీ, మోమోస్ వంటివి.
  • 10 నిమిషాల డెలివరీల కారణంగా ఒక్కో ఆర్డర్​కు డెలివరీ బాయ్ రోడ్డుపై గడపాల్సిన సమయం తగ్గుతుంది. రహదారి భద్రతపై డెలివరీ పార్ట్​నర్స్​కు అవగాహన కల్పించే కార్యక్రమం కొనసాగిస్తాం. వారికి ప్రమాద/జీవిత బీమా కల్పిస్తాం.
  • 10, 30 నిమిషాల డెలివరీలకు టైమ్​ లిమిట్​పై జొమాటో బాయ్స్​కు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. డెలివరీ ఆలస్యమైతే వారికి పెనాల్టీ ఉండదు. 10, 30 నిమిషాల డెలివరీలను సకాలంలో పూర్తి చేసినా ఇన్​సెంటివ్స్​ ఉండవు.

10 మినిట్​ డెలివరీ:

  • కిచెన్ ప్రిపరేషన్ టైమ్​: 2-4 నిమిషాలు
  • సగటు దూరం: 1-2 కిలోమీటర్లు
  • ప్రయాణ సమయం: 3-6 నిమిషాలు(సగటున గంటకు 20కి.మీ వేగంతో)

30 మినిట్​ డెలివరీ:

  • కిచెన్ ప్రిపరేషన్ టైమ్​: 15-20 నిమిషాలు
  • సగటు దూరం: 5-7 కిలోమీటర్లు
  • ప్రయాణ సమయం: 15-20 నిమిషాలు(సగటున గంటకు 20కి.మీ వేగంతో)

జోష్​ ఇవ్వని 10 మినిట్స్​ ప్లాన్​: కంపెనీ నుంచి ఓ మంచి ప్రకటన వచ్చినా కానీ.. జొమాటో షేర్ వ్యాల్యూలో పెద్ద మార్పులు కనిపించలేదు. అంతేగాకుండా.. ఉదయం సెషన్​లో షేర్లు మరింత కుంగాయి. దీనిని బట్టి చూస్తే 10 నిమిషాల డెలివరీ ప్లాన్​ మదుపర్లలో పెద్దగా జోష్ నింపలేదని అంటున్నారు మార్కెట్​ విశ్లేషకులు.

ఇదీ చూడండి: జొమాటో ఇన్​స్టంట్​.. ఇక 10 నిమిషాల్లోనే ఫుడ్​ డెలివరీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.