Consumer Goods Price Hike: సామాన్యులకు మరోసారి షాక్ ఇచ్చేందుకు ఎఫ్ఎంసీజీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. రోజువారీగా వినియోగించే వస్తువులు అయిన గోధుమ, పామాయిల్‌తో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్స్‌పై సుమారు పది శాతం మేర ధర పెంచేందుకు ఆయా కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అధిగమించడానికి పెంపు అనివార్యమని నిపుణులు చెప్తున్నారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. గోధుమ, నూనె, చమురు ధరలు భారీగా పెరుగుతాయనే వార్తల నేపథ్యంలో ధరలను పెంచక తప్పదని అంటున్నాయి ఎఫ్ఎంసీజీ సంస్థలు. డాబర్, పార్లే వంటి కంపెనీలు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ.. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, నెస్లే గత వారంలో ఆహారపదార్థాల ధరలను పెంచాయి.
ప్రస్తుతం ఉన్న ధరలపై సుమారు పది నుంచి పదిహేను శాతం మేర ధరలు పెరుగుతాయని పార్లే ప్రోడక్ట్స్ సీనియర్ క్యాటగిరీ హెడ్ మయాంక్ షా వెల్లడించారు. ధరల పెరుగుదల అనివార్యం అని తెలిపిన ఆయన.. కచ్చితంగా ఎంత పెరుగుతాయనేది చెప్పడం కష్టమన్నారు. అంతర్జాతీయంగా ధరల పెరుగుదలను బట్టి పెంపు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇటీవల లీటర్ పామాయిల్ ధర రూ.180 కు చేరి.. ప్రస్తుతం రూ. 150కి పరిమితం అయ్యింది. ముడి చమురు ధరలు కూడా బ్యారెల్ 140 డాలర్ల నుంచి 100 డాలర్లకు తగ్గినట్లు గుర్తుచేసిన ఆయన.. గతంతో పోల్చితే ఈ ధరలు కూడా ఇంకా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు.
ఇవీ చూడండి: