ETV Bharat / business

ప్రభుత్వరంగ బ్యాంకర్లతో రేపు ఆర్థిక మంత్రి భేటీ

నెలరోజుల వ్యవధిలో బ్యాంకర్లతో రెండోసారి భేటీ కానున్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం అనంతరం ఆర్థిక రంగంలో నిధుల ప్రవాహాన్ని సమీక్షించనున్నారు.

ప్రభుత్వరంగ బ్యాంకర్లతో రేపు ఆర్థిక మంత్రి భేటీ
author img

By

Published : Oct 13, 2019, 4:26 PM IST

Updated : Oct 13, 2019, 5:26 PM IST

ప్రభుత్వరంగ బ్యాంకర్లతో రేపు ఆర్థిక మంత్రి భేటీ

ప్రభుత్వ రంగ బ్యాంకుల ముఖ్య కార్యనిర్వాహణాధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక రంగానికి చేయూత అందించే దిశగా డిపాజిట్లు పెంచడం సహా మరిన్ని సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

బ్యాంకింగేతర ఆర్థిక కార్పొరేషన్లు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల్లోకి నిధుల ప్రవాహాన్ని అందించడంపైనా సమీక్షించనున్నారు నిర్మల. పాక్షిక రుణ హామీ పథకం, మూలధనాన్ని పెంచేందుకు మార్కెట్ల నుంచి నిధులను రాబట్టడంపై ఈ సమావేశంలో ఆర్థికమంత్రికి బ్యాంకర్లు నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి.

రూ. లక్ష కోట్ల పాక్షిక హామీ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం ఆగస్టులో మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ద్వారా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఆస్తులను ప్రభుత్వరంగ బ్యాంకులు కొనేందుకు వీలు కల్పించింది.

నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఆర్థికమంత్రి సమావేశం కావడం ఇది రెండోసారి.

ఇదీ చూడండి: బ్యాంకులు వడ్డీ రేట్లు ఎలా తగ్గిస్తాయి...?

AP Video Delivery Log - 0900 GMT Horizons
Sunday, 13 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0824: HZ Netherlands Rosetta Legacy AP Clients Only 4234149
Scientists look back on comet-chasing Rosetta mission
AP-APTN-0824: HZ Russia Elderly Kindergarten AP Clients Only 4234129
The kindergarten for 21st century pensioners
AP-APTN-0824: HZ UK Hydrogen Boat AP Clients Only 4234287
"Floating lab" on mission to change maritime industry
AP-APTN-0824: HZ Belgium Gourmet AP Clients Only 4234288
Brussels' new craze: foie gras with waffles
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 13, 2019, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.