కరోనాపై పోరులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ పరిశోధనల కోసం బయోటెక్నాలజీ విభాగానికి రూ. 900కోట్ల గ్రాంటు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
అయితే వ్యాక్సిన్ ధర, సరఫరా వ్యయాన్ని ఇందులో జోడించడం లేదని స్పష్టం చేశారు ఆర్థికమంత్రి. టీకా సిద్ధంగా ఉన్నప్పుడు ఆయా ఖర్చులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
మరోవైపు దేశీయ రక్షణ పరికరాలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, మౌలిక వసతుల కోసం.. రూ. 10,200కోట్ల అదనపు బడ్జెట్ను కేటాయించినట్టు పేర్కొన్నారు నిర్మలా సీతారామన్.
ఇదీ చూడండి:- 'పన్ను పారదర్శకత వైపు భారత్ అడుగులు'