ETV Bharat / business

బడ్జెట్​: అంకురాలకు ఆలంబనగా పన్ను మినహాయింపులు - boost for startups

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, అంకురాలను ప్రోత్సహించేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​లో కొన్ని ప్రతిపాదనలు చేశారు. పన్ను మినహాయింపు సౌకర్యంతో సహా ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్ సెల్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి ప్రతిపాదనలపై వర్థమాన పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

FM announces host of steps to boost growth of startups
బడ్జెట్​: అంకురాలకు ఆలంబనగా పన్ను మినహాయింపులు
author img

By

Published : Feb 2, 2020, 6:20 AM IST

Updated : Feb 28, 2020, 8:38 PM IST

ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్​లో అంకురాలను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకుగాను కొన్ని పన్ను మినహాయింపులు ప్రకటించారు. పెట్టుబడులు సులభంగా పొందేందుకుగాను ఇన్వెస్ట్​మెంట్ క్లియరెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

అంకురాలకు ప్రారంభ దశలో లైఫ్ ఫండింగ్ అందించడం, అభివృద్ధి దశల్లో విత్తన నిధులు (సీడ్ ఫండింగ్​) కూడా అందించాలని, అలాగే పన్ను చెల్లింపులను సులభతరం చేయాలని నిర్మలమ్మ ప్రతిపాదించారు. ఆర్థికమంత్రి ప్రతిపాదనలపై వర్థమాన పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

స్టార్టప్​లు పౌరులకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు, విలువ-ఆధారిత సేవలు అందిస్తాయని నిర్మలా సీతారామన్ అన్నారు. అందుకే ప్రభుత్వ మౌలికరంగాల ఏజెన్సీలు ఈ అంకురాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆమె సూచించారు.

ఈఎస్​ఓపీ

అంకురాల ప్రారంభ దశలో అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగులను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి 'ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ (ఈఎస్​ఓపీ)' ఉపకరిస్తుంది. దీని వల్ల ఉద్యోగులకు సకాలంలో పరిహారం చెల్లించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఈఎస్​ఓపీ పన్ను పరిధిలో ఉంది. ఫలితంగా స్టార్టప్​ల్లో తమ వాటాలను వెంటనే విక్రయించని ఉద్యోగులకు.. ఇది నగదు ప్రవాహ (క్యాష్ ఫ్లో) సమస్యను ఏర్పరుస్తుంది. దీనిని పరిష్కరించేందుకు మంత్రి కొన్ని ప్రతిపాదనలు చేశారు.

"అంకురాలను ప్రోత్సహించేందుకు... ఐదేళ్లపాటు పన్ను వాయిదా వేయాలి. ఉద్యోగస్తులు సంస్థను విడిచిపెట్టే వరకు లేదా సంస్థను విక్రయించేటప్పుడు, ఏది ముందు జరిగినా... ఉద్యోగులపై పన్ను భారం మాత్రం తగ్గించాలని నేను ప్రతిపాదిస్తున్నాను."

- నిర్మలా సీతారామన్, బడ్జెట్ ప్రసంగంలో.

రూ.25 కోట్ల టర్నోవర్ మించకపోతే..

"రూ.25 కోట్ల టర్నోవర్ ఉన్న అర్హత కలిగిన అంకురాలకు ఏడు సంవత్సరాల్లో వరుసగా మూడు అసెస్మెంట్ సంవత్సరాలకు 100 శాతం లాభాలను తగ్గించుకునే అవకాశం ఉంది. అదీ వాటి మొత్తం టర్నోవర్ రూ.25 కోట్లకు మించకపోతే. అయితే ఈ ప్రయోజనాన్ని రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న స్టార్టప్​లకు కూడా కల్పించాలని నేను ప్రతిపాదిస్తున్నాను."- నిర్మలాసీతారామన్, ఆర్థికమంత్రి

ప్రారంభంలో అంకురాలకు లాభాలు ఉండవు కనుక వాటికి పన్ను తగ్గింపు సౌకర్యం వలన లాభం కలుగకపోవచ్చు. అందుకే ఈ పన్ను మినహాయింపు వ్యవధిని ప్రస్తుతమున్న ఏడు సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచాలని నిర్మలా సీతారాన్​ ప్రతిపాదించారు.

సులభంగా క్లియరెన్స్

అంకురాల వ్యవస్థాపకులకు ఇన్వెస్టిమెంట్​ క్లియరెన్స్ సెల్ చక్కగా ఉపకరింస్తుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఓ పోర్టల్ నిర్వహిస్తామన్నారు. ఇది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు... అంకురాల్లో పెట్టుబడి పెట్టే ముందు తగిన సలహాలు ఇస్తుందని, ల్యాండ్ బ్యాంకులకు సంబంధించిన సమాచారం అందిస్తుందని తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో పెట్టుబడుల క్లియరెన్స్​లు సులభంగా పొందడానికి వీలుకల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'పన్ను చెల్లింపులో పాత విధానమే లాభదాయకం'

ZCZC
PRI ERG ESPL NAT SPO
.RANCHI DES35
JH-SPORTS
Sports transcends socio-cultural differences, brings people together: US state dept official
         Ranchi, Feb 1 (PTI) Sports transcends linguistic and socio-cultural differences and brings people together, a top US state department official has said here, highlighting the importance of cultural exchanges to improving people's lives.
         Marie Royce, the Assistant Secretary of the US Department of State for Educational and Cultural Affairs (ECA), who is on her first visit to Ranchi, said that she was thrilled to be here for the final tournament of the women's field hockey and leadership camp.
         "We at the US Department of State believe that the power of cultural exchanges through sports is transformative. Our shared passion for sports transcends linguistic and socio-cultural differences and brings people together," she said at the event organised at the Astroturf stadium near Hatia Railway Station.
         Expressing delight at the American collegiate athletes coming from Middlebury College in Vermont state to serve as coaches and citizen diplomats, Royce said that participation in sports also teaches leadership, teamwork and communication skills that help young people succeed in all areas of their lives.
         "I want to congratulate all the girls and women on the field today -- you've had a great week! I'd also like to thank our American and Indian partners in civil society and local government for your dedicated efforts to protect and empower girls in Jharkhand. When we work together, change happens," Royce said.
         Royce presented awards to the winning teams and interacted with the girls of Jharkhand and the trainers from the Middlebury College, Vermont.
         The final of the week-long event "One Win Leads to Another Field hockey and Leadership Camp" for 100 girls from tribal villages in Jharkhand was held on Saturday.
         The camp is funded by the US Consulate General, Kolkata and implemented by Shakti Vahini, an NGO, in collaboration with the South Eastern Railways -- Ranchi Division.
         Patti Hoffman, Consul General, the US Consulate, Kolkata and Monica Shie, Public Affairs Officer and Director of American Center, Kolkata accompanied Royce to Ranchi. PTI PVR
CPS
02012251
NNNN
Last Updated : Feb 28, 2020, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.