ETV Bharat / business

ఆదిత్య బిర్లా ఫ్యాషన్​లో ఫ్లిప్​కార్ట్​కు రూ.1500 కోట్ల వాటా - వాల్​మార్ట్

ఆదిత్య బిర్లా ఫ్యాషన్​ అండ్ రిటైల్​లో 7.8% శాతం వాటాను కొనుగోలు చేయనుంది దిగ్గజ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్​కార్ట్. ఈ మేరకు రూ.1500 కోట్లు వెచ్చించనున్నట్లు ఫ్లిప్​కార్ట్ పేర్కొంది.

Aditya Birla_Flipkart
ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు 7.8% వాటా
author img

By

Published : Oct 24, 2020, 7:01 AM IST

కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌లో వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ 7.8 శాతం వాటాను రూ.1500 కోట్లతో కొనుగోలు చేయనుంది. అధిక మార్జిన్‌ ఉండే ఫ్యాషన్‌ వ్యాపారంలో మరింతగా చొచ్చుకుపోయేందుకు ఈ కొనుగోలు దోహద పడుతుందన్నది సంస్థ అంచనా.

ఫ్రిఫరెన్షియల్‌ షేర్లను జారీ చేయడం ద్వారా ఫ్లిప్‌కార్ట్‌కు 7.8 శాతం వాటా ఇస్తామని ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది.

ఇదీ లావాదేవీ..

ఒక్కో షేరుకు రూ.205 అంటే.. గురువారం నాటి ముగింపు అయిన రూ.153.4తో పోలిస్తే 33.6 శాతం అధికంగా ఫ్లిప్‌కార్ట్‌ చెల్లించనుంది. షేర్ల కేటాయింపు అనంతరం ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ ప్రస్తుత యజమానులకు 55.1 శాతం వాటా ఉంటుంది.

ఎవరికెంత మేలు?

ఆదిత్య బిర్లాకున్న అంతర్జాతీయ, భారత బ్రాండ్ల ద్వారా ఫ్లిప్‌కార్ట్‌ ప్రయోజనం పొందనుండగా.. ఈ లావాదేవీ వల్ల ఆదిత్యబిర్లాకున్న రుణాలు తగ్గనున్నాయి. మార్చి 31, 2020 నాటికి కంపెనీకి రూ.2776 కోట్ల అప్పులున్నాయి. అమెజాన్‌.కామ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు పోటీ ఇవ్వడానికి ఫ్లిప్‌కార్ట్‌కు వీలయ్యే అవకాశం ఉంది.

ఫరెవర్‌ 21, అమెరికన్‌ ఈగల్‌ అవుట్‌ఫిట్టర్స్‌, రాల్ఫ్‌ లారెన్‌ బ్రాండ్లను విక్రయించే హక్కులు ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌కున్నాయి. దేశీయంగా పాంటలూన్స్‌తో పాటు 3000 స్టోర్లున్నాయి. 23,700 మల్టీబ్రాండ్‌ అవుట్‌లెట్లు, 6,700 పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ డిపార్ట్‌మెంట్‌ స్టోర్లలో సంస్థ ఉత్పత్తులు విక్రయమవుతున్నాయి.

7.5% శాతం లాభం

తాజా ఒప్పందం వల్ల ప్రస్తుత బ్రాండ్లను మరింత విస్తరించడానికి వీలవుతుందని ఆదిత్యబిర్లా ఫ్యాషన్‌ ఎండీ ఆశిష్‌ దీక్షిత్‌ పేర్కొన్నారు. ఆదిత్యబిర్లాతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి అన్నారు.తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రిటైల్‌ షేరు 7.5%లాభంతో రూ.165.05 వద్ద స్థిరపడింది.

ఇదీ చదవండి:మైక్రోమ్యాక్స్‌ 'ఇన్​' మొబైల్స్‌ వచ్చేది ఆ రోజే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.