ETV Bharat / business

అమెజాన్​తో పోటీకి ఫ్లిప్​కార్ట్​- బిగ్​ బిలియన్‌ డేస్‌ మార్పు! - ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​

ఫ్లిప్​కార్ట్​ 'బిగ్ బిలియన్​ డేస్'(Flipkart Big Billion Days 2021) తేదీల్లో మార్పులు చేసింది. అక్టోబరు​ 3 నుంచి 10 మధ్య ఈ విక్రయాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

flipkart offers
బిగ్ బిలియన్​ డేస్
author img

By

Published : Sep 26, 2021, 5:46 AM IST

ఫ్లిప్‌కార్ట్​ ఏటా నిర్వహించే 'బిగ్‌ బిలియన్‌ డేస్‌'(Flipkart Big Billion Days 2021) విక్రయాలను అక్టోబరు 3 నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ విక్రయాలను అక్టోబరు 7-10 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ గత మంగళవారం(Flipkart Big Billion Days 2021) ప్రకటించింది. అయితే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ను(Amazon Great Indian Festival 2021) 4న ప్రారంభించనున్నట్లు ప్రకటించి పోటీకి తెరతీసింది. ఈ వేడిని మరింత పెంచుతూ ప్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ తేదీలను అక్టోబరు 3-10కి మార్చింది.

కరోనా సంక్షోభం తర్వాత వ్యాపారులు మళ్లీ పుంజుకునేందుకు బిగ్‌ బిలియన్‌ డేస్‌ విక్రయాలు చాలా కీలకమని, దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను ఈ కార్యక్రమం సృష్టిస్తుందని ప్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీంతో అందరికీ లబ్ధి చేకూరే విధంగా బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2021(Flipkart Big Billion Days 2021) తేదీలను మారుస్తున్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ అధికారికంగా స్పందించలేదు.

రాయితీ..

అంతకుముందు.. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్‌ డెబిట్‌ కార్డులతో కొనుగోళ్లపై 10శాతం వరకు 'బిగ్​ బిలియన్​ డేస్'​లో(Flipkart Big Billion Days 2021) విక్రయాల్లో రాయితీ లభిస్తుందని ఫ్లిప్​కార్ట్​ తెలిపింది. అవసరమైన వస్తువులను ముందస్తుగా బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. కిరాణా దుకాణాలకు రూ.8లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లు సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు.

బిగ్​ బిలియన్​ డేస్​లో భాగంగా ఈ సారి ఎన్నో కొత్త ఉత్పత్తులు, గేమ్స్​, లైవ్​ స్ట్రీమ్స్​ అందుబాటులో ఉంటాయని ఫ్లిప్​కార్ట్​ పేర్కొంది. డిసెంబరు నాటికి 4.2 లక్షల మంది విక్రయదారులే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చింది.

ఇదీ చూడండి: Musk divorce: ఆమెతో విడిపోయిన ఎలాన్​ మస్క్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.